అమరావతి ఉద్యమం @ 100

farmers protest

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటు రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 100 రోజులకు చేరుకుంది. దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏపీ ప్రజలు జై అమరావతి ఉద్యమాన్ని వదలట్లేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు అయన ట్వీట్ చేసారు..... "జై అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకుంది. పెయిడ్ ఆర్టిసులు, రైతులు గోచి కట్టుకుని బురదలో ఉండాలి అంటూ అవమానాలు ఒక పక్క... లాఠీ దెబ్బలు, వేల సంఖ్యలో కేసులు, వేల మందిని జైలుకి పంపడం మరో పక్క... అయినా సహనం కోల్పోలేదు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు అమరావతిని కాపాడుకోవడానికి వంద రోజులుగా మేము సైతం అంటూ ముందుకు వచ్చిన రైతులు, మహిళలు, యువత కి ఉద్యమ వందనాలు" అని లోకేష్ ట్వీట్ చేసారు.