మహారాష్ట్రలో 124కు చేరిన కరోనా కేసులు..

corona

కరోనా వైరస్ ప్రభావం మహారాష్ట్రలో తీవ్రంగా ఉంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. గురువారం ఉద‌యం కొత్త‌గా న‌మోదైన రెండు కేసుల‌తో క‌లిపి మ‌హారాష్ట్ర‌లో మొత్తం కేసుల సంఖ్య 124కు చేరింద‌ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. కొత్త‌గా క‌రోనా పాజిటివ్‌గా తేలిన ఇద్ద‌రిలో ఒక‌రు థానేకు చెందిన‌వారు కాగా, మ‌రొక‌రు ముంబై వాసి అని తెలిపింది. 

ఇక భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 673కు చేరగా.. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనాతో 12 మంది మృతి చెందారు. 42 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.