అసలైన తెలుగుదేశం సైనికుడు అచ్చెన్నాయుడు..

chandrababu

నేడు టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పుట్టిన రోజు సందర్బంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన చంద్రబాబు.. "క్రమశిక్షణ, అంకితభావం కలిగిన అసలైన తెలుగుదేశం సైనికుడు, శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు శతాయుష్కులై, సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో నిండైన ప్రజాజీవితాన్ని అందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు.