నేను ఆదిశక్తిని.. పోలీసులపై కత్తిదూసిన మహిళ

woman

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఓ వైపు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన లాక్‌డౌన్ అమలవుతుంటే... ఓ మహిళ తన ఆథ్యాత్మిక కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు ‘ఆదిపరాశక్తి’ అవతారమెత్తారు.  "నేను ఆదిశక్తిని... దమ్ముంటే నన్ను ఇక్కడ నుంచి పంపించేందుకు ప్రయత్నించండి’’ అంటూ ఓ మహిళ పోలీసులకు సవాలు విసిరింది. వారిపై కత్తిదూస్తూ హల్‌చల్‌ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దగ్గరకు వస్తున్న పోలీసులపై బెదిరింపులకు దిగారు. ఎంతకూ మాట వినకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాలన్నీ పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రాకూడదని  నిబంధనలు విధించాయి. ఒకవేళ ఎవరైనా అనవసరంగా రోడ్లపై తిరిగితే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.