లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది : కేసీఆర్

kcr

తెలంగాణాలో లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలవుతున్నదని, రాబోయే రోజుల్లో కూడా ఇంతే పకడ్బందీగా అమలుచేయాలని సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నిన్న ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు తన కార్యాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించిన ఆయన, పలువురు సీనియర్ అధికారులు, కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగినవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని కనిపెడుతూ ఉండాలని అధికారులను కోరారు. వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే, ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, సామాజిక దూరాన్ని పాటించడమే మన ముందున్న ఉత్తమ మార్గమని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.