తెలంగాణా బోర్డర్ లో చిక్కుకున్న ఆంద్రా లారీ డ్రైవర్లు..

 lorry drivers

తెలంగాణా బోర్డర్ లో ఆంద్రా లారీ డ్రైవర్లు.. చిక్కుకున్నారు. భధ్రాచలం చెక్ పోస్ట్ వద్ద లాక్ డౌన్ కారణంగా డ్రైవర్లను ఆంద్రా పోలీసులు నిలిపివేశారు. 4 రోజుల నుంచి తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లూ లేక 40 మంది లారీ డ్రైవర్లు విలవిల లాడుతున్నారు. తమ వేదనను మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, ప్రకాశం జిల్లా SP పట్టించుకుని తమను తమ సొంత గ్రామాలకు చేర్చేలా..  చర్యలు తీసుకోవాలని బాధితులు విన్నవించుకుంటున్నారు. మరి కొన్ని రోజులు ఇక్కడే ఉంటే చనిపోతామని దయచేసి తమను రక్షించమని ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చేందిన లారీ డ్రైవర్లు వేడుకుంటున్నారు.