నడిరోడ్డుపై జర్నలిస్టులను చితకబాదిన పోలీసులు

journalists

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో కొందరు ఖాకీలు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. హనుమాన్ జంక్షన్ లో న్యూస్ కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దాడి చేశారు. తాము జర్నలిస్టులమని చెబుతున్నా పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటనలో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. దీంతో హనుమాన్ జంక్షన్ లో జర్నలిస్ట్ సంఘాలు ధర్నాకు దిగాయి.