తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌

corona

 ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణాలో కూడా విజృంభిస్తుంది. తాజాగా తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో తెలంగాణలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 44కి చేరుకుంది. కుత్బుల్లాపూర్‌కి చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యుల నమూనాలు పరీక్షించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కుత్బుల్లాపూర్‌కి చెందిన వ్యక్తి ఇటీవల దిల్లీ నుంచి రాగా.. కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే ఆయనకూ పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దోమలగూడలో 43 ఏళ్ల వైద్యుడి నుంచి వైద్యురాలిగా ఉన్న ఆయన భార్యకూ వైరస్‌ సోకింది.