ఒవైసీ హాస్పిటల్‌ను ఐసోలాషన్ వార్డుగా మార్చాలి : బండి సంజయ్

bandi sanjay

ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించడంపై ప్రపంచదేశాలు స్వాగతిస్తుంటే.. ఎంఐఎం నేత అసదుద్దీన్ తప్పుడు ప్రచారం చేయటం సిగ్గు చేటు అని అన్నారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ.. మైనార్టీ ఓట్లతో రాజకీయ పబ్బం గడిపే అసదుద్దీన్ ఓవైసీ.. కరోనా వైరస్ నివారణకు పిలుపునివ్వకపోవడం సిగ్గు చేటు అని బండి సంజయ్ విమర్శించారు. కరోనా బారిన పడిన ముస్లిం సమాజాన్ని రక్షించడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఒవైసీకి తగదని సూచించారు. హైదరాబాద్‌లోని ఒవైసీ హాస్పిటల్‌ను ఐసోలాషన్ వార్డుగా ప్రభుత్వం వినియోగించాలని ఆయన కోరారు. డాక్టర్లపై జరిగిన దాడిని ఓవైసీ ఖండించకపోవడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు.