ప్రధానితో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌

modi

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ప్రధానికి వివరించారు. పలు విషయాలను ప్రధానికి వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను వారికి తెలిపారు. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడానికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం వివరించారు. ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 111 కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయినవారేనని వీడియో కాన్ఫరెన్స్‌ సీఎం స్పష్టం చేశారు.