కరోనా వైరస్ లక్షణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Coronavirus Symptoms

ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. కరోనా మహమ్మారి రోజురోజూకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలు దాని కట్టడికి ఎంతగానో శ్రమిస్తున్నాయి. కరోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టే ప్ర‌య‌త్నంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ‌ప్రాతిప‌దికన చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. 

కరోనా లక్షణాలు

 • కరోనా బారిన పడిన వారికి జలుబు, దగ్గు, తీవ్రమైన గొంతు నొప్పి, శ్వాస తీసుకోలేని పరిస్థితి, తల నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.
 • ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.
 • కరోనా సోకకుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ లాంటివి ఇంకా అందుబాటులోకి రాలేదు. దీని కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
 • ప్రజలు రోగ నిరోధక శక్తి తగ్గకుండా మంచి ఆహారం తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తగ్గితే కరోనా సోకిన వారికి నిమోనియా కూడా వచ్చే ప్రమాదం ఉంది.   

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

 • తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతులు లేదా కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి. ఆ వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి.
 • ప్రతి ఒక్కరూ తరచుగా చేతులను సబ్బు, లేదా హ్యాండ్ వాష్ లిక్విడ్స్ తో శుభ్రం చేసుకోవాలి.
 • ఎవరైనా జ్వరం, తీవ్రమైన జలుబు, శ్వాస సమస్యలతో బాధపడుతుంటే వారికి దూరంగా ఉండండి.
 • మీకు జ్వరం, జలుబు, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో సమస్య ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని కలవండి.
 • విదేశాల నుంచి వచ్చిన వారెవరైనా జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే నేరుగా డాక్టర్లను కలిసి విషయం చెప్పాలి.
 • వీలైనంత వరకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మంచిది.
 • ముక్కులు, నోరు దగ్గర చేతులు పెద్దగా పెట్టకపోవడం మేలు.