ఏపీలో 2,514కి చేరిన కరోనా కేసులు..

corona

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 8,415 శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 62 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని.. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,514 కి చేరుకుందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 51 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 728 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,734 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కృష్ణా జిల్లాలో, కొవిడ్‌-19 వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 55కి చేరింది.