ప్రజల ఆస్తులకు వైసీపీ రంగులు ఏంటి?

TDP

వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  ఆర్టీసీ బస్సులకు వైసీపీ జెండా రంగులు వేయడం పై మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రావణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు పార్టీ రంగులు ఏంటి? అని ప్రశ్నించారు. నీచ రాజకీయాలకు పరాకాష్ట అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం నుంచి బస్సులు రోడ్డెక్కగా  బస్సుకు రంగులు మార్చారని మంత్రులు ఆరోపించారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.