ఇప్పుడు మనది 5 మిలియన్ల కుటుంబం : కీర్తి సురేశ్

keerthi suresh

అందమైన రూపం, అలరించే హావభావాలతో  ప్రేక్షకులను మెప్పించిన కథానాయిక కీర్తి సురేశ్. మహానటితో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కీర్తి.. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై, సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ ఉంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 లక్షలను దాటగా, ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి, ఆమె ఓ వీడియో పోస్ట్ చేసింది. తన పెట్ డాగ్ తో కలిసి రూపొందించిన ఈ వీడియోలో కీర్తి మాట్లాడుతూ.. 'ఇప్పుడు మనది 5 మిలియన్ల కుటుంబం..!! మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను, నైక్‌ ఎంతో సంతోషిస్తున్నాం' అని పేర్కొన్నారు. వీడియోలో కీర్తీ సురేశ్ మేకప్ లేకుండా కనిపించడం గమనార్హం. ప్రస్తుతం కీర్తి, 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'రంగ్ దే' చిత్రాల్లో నటిస్తున్నారు.