విద్యుత్‌ చార్జీలు రద్దు చేయమంటే వినపడటం లేదా.. జగన్‌ గారు : దేవినేని

devineni uma

కోటీశ్వరుల కంపెనీలకు విద్యుత్ చార్జీలను రద్దు చేయడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

ఈ మేరకు దేవినేని ఉమా స్పందిస్తూ.. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో శ్లాబులు మార్చి.. రేట్లు పెంచి..పేద, మధ్య తరగతి వర్గాలను బాదేశారు. రూ.కోట్ల ప్రజాధనంతో పత్రికలలో ప్రకటనలు ఇస్తున్నారు. కోటీశ్వరుల కంపెనీలకు రూ.187 కోట్ల విద్యుత్‌ చార్జీలను రద్దు చేశారు. కోటి 35 లక్షల వినియోగదారుల చార్జీలను..రద్దు చేయమంటుంటే మాత్రం వినపడటం లేదా.. జగన్‌ గారు’’ అంటూ ట్వీట్ చేశారు.