పశ్చిమ బెంగాల్ చేరుకున్న ప్రధాని

PM Modi reaches West Bengal

అంఫాన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. పశ్చిమబెంగాల్‌ లో అంఫాన్‌ సృష్టించిన భీభత్సానికి 72 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా ఆస్థి నష్టం కూడా జరిగింది. అంఫాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్‌ లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బెంగాల్‌ కు చేరుకున్నారు.  కోల్‌కత్తా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మమతను పలకరించిన మోదీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏరియల్ సర్వే ద్వారా తుఫాను నష్టాన్ని అంచనా వేసిన అనంతరం ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌తో పాటు తుఫాన్ ప్రభావిత రాష్ట్రమైన ఒడిశాలో కూడా ప్రధాని పర్యటించనున్నారు.