హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ

high court

ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. పంచాయతీ కార్యాలయలకు రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. సుప్రీం, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జీవో ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.  ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని సీఎస్, పంచాయతీరాజ్‌శాఖ, ఈసీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించిన కోర్టు.. ఈ నెల 28లోపు రంగులు తీసేయాలి లేదా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.  ఈనెల 28లోపు రంగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని హైకోర్టు పేర్కొందని.