డాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

sudhakar

డాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ ఘటనపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.  8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  విచారణ సందర్భంగా హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. డాక్టర్ సుధాకర్ ఒంటిపై గాయాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని.. ప్రభుత్వ నివేదికలో ఆ గాయాల ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రభుత్వ నివేదికపై అనుమానాలు ఉన్నాయని.. అందుకే సీబీఐ విచారణకు ఆదేశించామని కోర్టు చెప్పింది. వైద్య సిబ్బందికి మాస్కులు లేవంటూ గతంలో వ్యాఖ్యానించి సస్పెండైన మత్తు వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ విశాఖపట్నంలో జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.