పశ్చిమబెంగాల్ లో ప్ర‌ధాని ఏరియ‌ల్ స‌ర్వే.. వెయ్యి కోట్ల ప్యాకేజీ..

modi

పశ్చిమబెంగాల్ లో అంఫాన్ తుఫాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోదీ ఏరియల్ సర్వే చేశారు. విమానం ద్వారా తుఫాన్ కు గురైన ప్రాంతాల‌ను ప్రధాని వీక్షించారు. విమానంలో మోడితో పాటు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, కేంద్ర మంత్రులు ధ‌ర్మేంధ్ర ప్ర‌ధాన్, బాబుల్ సుప్రియో, ప్ర‌తాప్ చంద్ర సారంగి, దేవ‌శ్రీ చౌద‌రీలు ఉన్నారు. అంఫాన్ విలయ తాండవానికి ఇప్పటివరకు బెంగాల్ లో 80 మంది మృతి చెందారు. ఒడిశాలో ఇద్దరు మృతి చెందారు. 44.8 లక్షల మంది ప్రభావితమయ్యారు. 

ఆంఫన్ తుపాను కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్న మోదీ కష్టకాలంలో బెంగాల్ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. తాత్కాలిక సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిశాక మరింత సాయం చేస్తామన్నారు. అదేవిదంగా.. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం కూడా ప్రధాని ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయల సాయం ప్రకటించారు.