ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి : చిదంబరం

chidambaram

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడిస్తున్న కరోనా గణాంకాలకు, ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడిస్తున్న కరోనా కేసుల సంఖ్యకు మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఆరోపించారు. 

ఈ మేరకు చిదంబరం ట్వీట్ చేస్తూ.. ''ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య 118,447 ఉండగా.. ఇందులో యాక్టివ్‌ కేసులు 66330, మరణాలు 3583. ఐతే డాష్‌బోర్డులో మాత్రం మొత్తం కేసుల సంఖ్య 1,16,723గా ఉంది.(మూలం: ఐసీఎంఆర్, ఎంహెచ్‌ఎఫ్‌డబ్య్లు)'' అంటూ చిదంబరం ట్వీట్ చేశారు.