మెమోరియల్ మ్యూజియంగా జయలలిత వేద నిలయం..!

veda nilayam

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసం స్మారక మందిరంగా మారనుంది. జ‌యల‌లిత నివాసం 'వేద ఇల్లం'ను స్వాధీనం చేసుకుని స్మార‌కంగా తీర్చిదిద్దాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఆర్బినెన్స్ పై గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ సంతకం చేశారు. బంగళాను ప్రభుత్వం వశం చేసుకోవడానికి ఆమోద ముద్ర వేశారు.

చాలాకాలం పాటు జయలలిత పోయెస్ గార్డెన్స్ బంగళాలో నివాసం ఉన్నారు. సినీ, రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే ఆరంభమైంది. 2016 సెప్టెంబ‌ర్‌లో ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరేంత వరకూ జయలలిత ఇదే బంగళాలో నివాసం ఉన్నారు. ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన తరువాత పార్థివ దేహాన్ని మొదట ఈ బంగళాకే తీసుకొచ్చారు. అనంతరం అభిమానుల కోసం టౌన్‌హాల్‌లో ఉంచారు. జయలలిత మరణించిన తరువాత ఆమె సన్నిహితురాలు శ‌శిక‌ళ ఆ ఇంట్లో కొన్నాళ్లు ఉన్నారు. ఆస్తుల కేసులో ఆమె అరెస్టయిన తరువాత ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది.