బావిలో 9 మృతదేహాలు.. వరంగల్ లో వలస విషాదం..

gorrekunta

వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు 9 మృతదేహాలు బయటపడ్డాయి. ఈ బావిలో నుంచి గురువారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలను పోలీసులు కనుగొనగా.. నేడు మరో 5 మృతదేహాలు అదే బావిలో లభ్యమయ్యాయి. మృతులు ఎండీ మక్సూద్‌(50), ఆయన భార్య నిషా(45), కుమార్తె బుస్ర (20), మూడేళ్ల మనవడిగా గుర్తించారు. ఇవాళ లభ్యమైన 5 మృతదేహాల్లో మక్సూద్‌ కుమారుడు షాబాద్‌(22), బిహార్‌కు చెందిన కార్మికుడు శ్రీరామ్‌గా గుర్తించారు. మరొ మృత దేహం వివరాలు తెలియాల్సి ఉంది. వలస కార్మికులు కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో స్వస్థలాలకు వెళ్ళలేక సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారా ? లేకా ఇంకేమైనా కారణాలున్నాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

గొర్రెకుంట బావిలో తొమ్మిది మంది మృతిపై దర్యాప్తు చేస్తున్నామని  వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు 9 మంది టీమ్ లను ఏర్పాటు చేశారు. సివిల్ పోలీసులతో ఐదు టీమ్‌లను, స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో మరో నాలుగు టీమ్‌లను పోలీసులు  ఏర్పాటు చేశారు. ఈ 9 టీమ్ లు దర్యాప్తును వేగవంతం చేసినట్టుగా సీపీ రవీందర్ తెలిపారు.