హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

sudhakar

డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐకి అప్పగించాలన్న గౌరవ హైకోర్టు నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని అన్నారు. ఎన్-95 మాస్కు అడిగినందుకు ఓ డాక్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తూ, నిర్బంధించడమే కాకుండా, పోలీసులతో హింసకు పాల్పడ్డారని, దీని వెనకున్న ప్రభుత్వ కుట్ర సీబీఐ దర్యాప్తుతో వెల్లడవుతుందని తాము గట్టిగా నమ్ముతున్నట్టు చంద్రబాబు తెలిపారు.