తెలంగాణాలో జూన్‌ 8 నుంచి పదోతరగతి పరీక్షలు

ssc exams

కొవిడ్‌-19 నిబంధనలకు లోబడి జూన్‌ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఇటీవల జారీచేసిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. జూన్‌ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలన్న న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

పరీక్షల షెడ్యూల్‌..

  • జూన్‌ 8వ తేదీ (సోమవారం) ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌
  • 11వ తేదీ (గురువారం) ఇంగ్లీష్‌ రెండో పేపర్‌
  • 14వ తేదీ (ఆదివారం) గణితము మొదటి పేపర్‌
  • 17వ తేదీ (బుధవారం) గణితము రెండో పేపర్‌
  • 20వ తేదీ (శనివారం) సామాన్యశాస్త్రము మొదటి పేపర్‌
  • 23వ తేదీ (మంగళవారం) సామాన్యశాస్త్రము రెండో పేపర్‌
  • 26వ తేదీ (శుక్రవారం) సాంఘిక శాస్త్రం మొదటి పేపర్‌
  • 29వ తేదీ (సోమవారం) సాంఘిక శాస్త్రం రెండో పేపర్‌
  • జూలై 02వ తేదీ (గురువారం) ఓరియంటర్‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేవప్‌ (సంస్కృతము, అరబిక్‌)
  • జూలై 05వ తేదీ (ఆదివారం) ఓరియంటర్‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ రెండో పేపర్‌ (సంస్కృతము, అరబిక్‌)