ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

ab venkateswara rao

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ ఆర్డర్‌ను కూడా న్యాయస్థానం పక్కనపెట్టింది. వెంకటేశ్వరరావు రిట్ పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. అలాగే సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవటంపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. భద్రతా ఉపకరణాల కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని పేర్కొంటూ ఆయనను సస్పెండ్‌ చేసింది.ప్రజాప్రయోజనాల రీత్యా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. సస్పెన్షన్‌పై ఆయన క్యాట్‌ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.