కుప్పకూలిన విమానం

plane crash

 పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ విమానం కుప్పకూలిపోయింది. కరాచీ ఎయిర్‌పోర్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో విమానం  కూలినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 100 మంది ‍ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనతో కరాచీలోని అన్ని పెద్ద ఆస్పత్రుల్లో ఆరోగ్యశాఖ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇక  ప్రజలు నివశిస్తున్న ప్రదేశంలో విమాన ప్రమాదం చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండచ్చని తెలుస్తోంది.