ఆర్టీసీ బస్సు చోరీ..!

rtc bus

అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆర్టీసీ బస్సు చోరీ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు ఓ దుండగుడు. బస్సును తీసుకెళ్తుండగా గమనించిన డ్రైవర్లు, సిబ్బంది వెంటపడినప్పటికీ మరింత వేగం పెంచి బస్సును తీసుకెళ్లాడు. బస్సు చోరీపై డిపో మేనేజర్ డయల్‌ 100కు సమాచారం అందించారు. సమచారం అందుకున్న పోలీసులు పెనుకొండ కియా పోలీసు స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు తో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బెంగుళూరుకు చెందిన విజి పురం ప్రాంతానికి చెందిన జమ్మిల్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు.