వైసీపీ చారిత్రక విజయానికి ఏడాది..!

ysrcp

అసెంబ్లీలో 151 స్థానాలు, లోక్ సభలో 22 సీట్లు గెలిచి చారిత్రక విజయాన్ని సాధించిన వైఎస్సార్‌ సీపీ‌ ప్రభుత్వం ఏర్పడి నేటి తో ఏడాది పూర్తయ్యింది. గతేడాది మే 11వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగితే.. మే 23న ఫలితాలు వచ్చాయి. 86 శాతం అసెంబ్లీ సీట్లు, 92 శాతం ఎంపీ సీట్లను సాధించి తిరుగులేని ప్రజాబలంతో వైఎస్సార్‌ సీపీ ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని సాధించి రికార్డులు తిరగరాసింది.

ఎన్నికలకు ముందు ప్రజా సమస్యలపై పోరులో భాగంగా వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో 341 రోజుల పాటు 3,648 కి.మీ. మేర నిర్వహించిన ‘ప్రజాసంకల్ప యాత్ర’ను నిర్వహించారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్త, కొత్త పథకాలతో ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నారు. వినూత్నమైన పథకాలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రిగా ఈ నెల 30తో ఏడాది పూర్తి చేసుకుంటున్నారు.