గ్రామ వాలంటీర్లపై టిడిపి నేతల దాడి..

tdp

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి మండలం మన్నవరంలో గ్రామ వాలంటీర్లపై టిడిపి నాయకులు దాడి చేశారు. టిడిపి స్థానిక నేత చెంచయ్య నాయుడు..  గ్రామ సచివాలయానికి తాళాలు వేశారు. దీంతో గ్రామ వాలంటీర్లు ఎంపిడివోకి ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ వాలంటీర్లను  టీడీపీ నేతలు చితకబాదారు. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు అక్కడికి చేరుకుని టీడీపీ నేతలతో ఘర్షణకు దిగారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.