మ‌రో సంచ‌ల‌న ట్వీట్‌ చేసిన‌ నాగ‌బాబు

nagababu

జనసేన నేత నాగబాబాబు తాజాగా మ‌రో ట్వీట్ చేసి హాట్ టాపిక్‌గా నిలిచారు. నాథూరాం గాడ్సే జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌భ‌క్తుడు అనేలా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ కరెన్సీ పై మ‌రో ట్వీట్ చేశారు.  "ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది." అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన ట్వీట్  ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.