వైసీపీ ఏడాది పాలనంతా దాడులు, దౌర్జన్యాలే..

anuradha

వైసీపీ ప్రభుత్వం ఏడాది పరిపాలనపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైసీపీ ఏడాది పాలనంతా దాడులు, దౌర్జన్యాలతోనే గడిచిపోయిందని విమర్శించారు. జగన్ పాలనలో దళితులను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను దారుణంగా హింసించారన్నారు. కుచ్చులూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయమన్నందుకు మాజీ ఎంపీ హర్షకుమార్‌ను వేధించారని గుర్తుచేశారు. హైకోర్టు 67 సార్లు మొట్టికాయలు వేసినా జగన్ ప్రభుత్వంలో చలనం లేదని ఎద్దేవా చేశారు.