డా. సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పుపై ఆమంచి సంచలన వ్యాఖ్యలు

amanchi

డాక్టర్ సుధాకర్ కేసు ఒక పెటీ కేసు అని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వ్యాఖ్యానించారు. సుధాకర్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ సుధాకర్ కేసుపై సీబీఐ విచారణ వేయడంపై యావత్ రాష్ట్రం విస్తుపోయిందన్నారు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదు. కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోందని విమర్శించారు. కరోనా లేకపోతే హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండేవాడినని ఆమంచి కృష్ణ మోహన్ అన్నారు.