ఏపీలో 2,561 కి చేరిన కరోనా కేసులు..

corona

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 9,136 శాంపిళ్లను పరీక్షించగా మరో 47 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 2,561 కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 47 మంది డిశ్చార్జ్‌ అవగా.. ఇప్పటివరకు 1,778 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 727 మంది చికిత్స పొందుతుండగా.. 24 గంటల్లో కృష్ణాజిల్లాలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 56కి చేరింది.