నాగబాబు ట్వీట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్

pawan kalyan

నాథూరామ్ గాడ్సేపై సినీనటుడు, జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. నాగబాబు చేసిన ట్వీట్లు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని.. దీనికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని పవన్ స్పష్టంచేశారు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలుగా కొంతమంది వక్రీకరిస్తున్నారని పవన్ అన్నారు. కరోనా వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతుంటే నేతలంతా ప్రజాసేవలో ఉండాలే తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లరాదని పవన్ సూచించారు.