ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు

corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,986 శాంపిల్స్ టెస్టు చేయగా 141 మందికి వైరస్ సోకినట్లు తేలిందని ఏపీ ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. ఇందులో రాష్ట్రానికి చెందిన 98 మందికి కరోనా పాజిటివ్ రాగా.. వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన 43 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కొత్తగా నమోదైన కేసులతో కలిపితే ఏపీలో మొత్తం 4, 112కి కరోనా కేసులు చేరాయి.  రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 71కి చేరుకుంది.