రెండో విడత ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ ప్రారంభం

jagan

రెండో విడత వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆటో, ట్యాక్సీ ఉన్న 2,62,493 మంది లబ్దిదారులకు రెండో విడతగా రూ.10వేలు ఆర్ధిక సాయం అందనుంది.  ఈ సందర్భంగా ఆటో, ట్యాక్సీ కార్మికులను ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలను స్వయంగా చూశానన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌ వాహనమిత్ర పథకానికి అర్హత ఉండి సాయం అందని వారు స్పందన యాప్‌లో నమోదు చేసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు.