ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం 

kanaka durga temple

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలు కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అయినా కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడిది ఆలయాలను తాకింది. విజయవాడలోని ప్రసిద్ధి పొందిన ఇంద్రకీలాద్రి ఆలయంలోని అర్చకుడు కరోనా భారిన పడ్డాడు. దుర్గమ్మ గుడిలో లక్ష కుంకుమార్చనలో విధులు నిర్వహిస్తున్న అర్చకునికి కరోనా సోకింది. దుర్గ గుడిలోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయగా, అర్చకుడుకి కరోనా పాసిటివ్ అని తేలింది. దీంతో అర్చకుడుని పన్నమనేని ఆస్పత్రికి తరలించారు. అర్చకుడుకి కరోనా సోకిందని తెలియటంతో దుర్గ గుడిలోని ఉద్యోగుల్లో ఆందోళన మొదలయింది.