వెన్నుపోట్ల తోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడు

vijayasai reddy

హైద్రాబాదులోని పార్క్ హయత్ హోటల్లో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్, బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి రహస్య భేటీపై, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపై, వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేస్తున్నారు. 
ఈ సందర్బంగా ట్విట్టర్ లో స్పందిస్తూ...... "ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరు జరుపుతానని ఎగిరెగిరి పడుతుంటే నిజమే అనుకున్నారంతా. కమ్మని విందులతో పార్క్ హయత్ సాక్షిగా ఇలా దొరికిపోతాడని ఊహించలేదు. జీవితంలో ముఖాముఖి తలపడే యుద్ధానికి సాహసించడు. వెన్నుపోట్ల తోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడు". అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.
అలాగే "పార్క్ హయత్ భేటీ వార్తలను ఎల్లో మీడియా తొక్కిపెట్టింది. అంతగా పట్టించుకోదగిన ఘటన కాదని ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసింది. వాళ్లు ‘కొక్కొరోక్కో’ అంటేనే తెల్లారే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 కోట్ల మంది ఆ ముగ్గురి రహస్య కలయికను చూసారు. సోషల్ మీడియా ఊరుకోదు కదా." అంటూ వీరి ముగ్గురి భేటీపై చురకలు అంటించారు.