కరోనా అంటే వైసీపీ ప్రభుత్వానికి పిల్లాటలు అయిపోయింది

nara lokesh

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ... కరోనా అంటే వైసీపీ ప్రభుత్వానికి పిల్లాటలు అయిపోయింది. జగన్ గారు పారాసెటమాల్ మాటలు చెప్పినట్టే యంత్రాంగం కరోనా టెస్టులను ఆషామాషీగా చేస్తుందా అన్న అనుమానం వస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారికి కరోనా టెస్టు చేసి పాజిటివ్ వచ్చిందని, క్వారంటైన్ కు రమ్మని హడావిడి చేసారు. తీరా దీపక్ రెడ్డిగారు హైదరాబాద్ లో రెండుసార్లు RT PCR పరీక్ష చేసుకుంటే రెండు చోట్లా నెగటివ్ అని వచ్చింది. ఒక ఎమ్మెల్సీ విషయంలోనే ఇలా ఆటలాడితే, ప్రజలతో ఇంకెన్ని ఆటలు ఆడుతున్నారు వీళ్ళు? ప్రజల ప్రాణాలకు సంబంధించిన కరోనా పరీక్షల్లో ఏమిటీ నిర్లక్ష్యం? అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
అయితే తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిగారికి చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ చేసుకోకుండా ఆయనను క్వారంటైన్ లో పెట్టడానికి చేసిన హడావిడి చూస్తే.. ఇంకేదయినా కుట్ర చేసిందా ప్రభుత్వం అని కూడా అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా కరోనా పరీక్షల విశ్వసనీయత తేలాల్సిందే. అంటూ వైసీపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసారు.