ఆల్ రౌండర్ మహమ్మద్ హఫీజ్ పై పీసీబీ ఆగ్రహం

mohammed hafeez

కరోనా నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే జట్టులో 29 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ పదిమందిలో ఒకడైన ఆల్ రౌండర్ మొహమ్మద్ హఫీజ్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అయితే ఈ పరీక్షలో నెగటివ్ అని తేలింది. ఈ విషయాన్నీ హఫీజ్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. కాగా ఈ విషయంలో పీసీబీ హఫీజ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ సీఈఓ వసీం ఖాన్ మాట్లాడుతూ... ప్రైవేట్ పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకునే ముందు బోర్డును అతను సంప్రదించలేదని హఫీజ్ పై మండిపడ్డారు. దేశ పౌరుడిగా అతను ప్రైవేట్ పరీక్షలు చేయించుకోవడానికి హక్కు ఉంది, కానీ అతను ప్రైవేట్ పరిక్షలు చేయించుకునే ముందు మొదట మాతో సంప్రదించాలి అని అన్నారు. తన సొంత నిర్ణయాల వల్ల మాకు సమస్యలు తలెత్తాయి. అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.