ఏపీలో కొత్తగా 553 కరోనా కేసులు 

coronavirus

కరోనా మహమ్మారి ఏపీని అతలాకుతలం చేస్తుంది. కరోనా విజ్రంభన విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 477 మంది కాగా, పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన వారు 69 మంది ఉన్నారు. అలాగే ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులెటిన్ ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,884 కు చేరాయి. వీరిలో 5760 మంది కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, 4988 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కరోనాతో కర్నూల్ జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు మరియు తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున మొత్తం ఏడుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 136 చేరుకున్నాయి.