సీబీఎస్ఈ పరీక్షలు రద్దు 

CBSE exams canceled

దేశంలో కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్న నేపథ్యంలో 10 వ తరగతి, 12 వ తరగతి పరిక్షలను రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం జూలై 1 నుండి జూలై 15 వరకు జరగాల్సిన పరీక్షలను నిర్వహించడానికి తగిన పరిస్థితులు లేని కారణంగా రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ బోర్డు సుప్రీమ్ కోర్టుకు తెలిపింది. అయితే కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. గురువారం సుప్రీం కోర్టులో సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై విచారణ జరిగిన నేపథ్యంలో వెంటనే పరీక్షను రద్దు చేయాలనీ సుప్రీం కోర్ట్ సీబీఎస్ఈ బోర్డుకు తెలిపింది. దీంతో సీబీఎస్ఈ బోర్డు 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.