టీడీపీ నేతలు అరెస్ట్ 

tdp leaders arrest

ప్రజా వేదికను కూల్చి ఏడాది అయిన సందర్భంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు కరకట్ట ప్రాంతానికి వెళ్లిన టిడిపి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కరకట్ట ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టిడిపి నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, టి.శ్రావన్ ‌కుమార్‌, నక్కా ఆనందబాబు మరియు టీడీపీ కార్యకర్తలు ప్రజా వేదిక వద్దకు బయలుదేరారు. అయితే వీరి రాకను గమనించిన పోలీసులు ఉండవల్లి వద్ద అడ్డుకున్నారు. మొత్తం నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఎక్కడి వారిని అక్కడే ఆపేసి, ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేసారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ టిడిపి నేతలు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టిడిపి నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి, మంగళగిరి పోలీస్‌స్టేషన్‌ కు తరలించారు.