వందే భారత్ మిషన్...వాషింగ్టన్ నుండి ఢిల్లీకి 224 మంది భారతీయులు 

vande bharat mission

వందే భారత్ మిషన్ లో భాగంగా అమెరికాలో చిక్కుకున్న 224 మంది భారతీయులు వాషిగ్టన్ డిసి నుండి ఇండియాకు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం బయలుదేరారు. వాషింగ్టన్ డిసి నుండి ఢిల్లీకి బయలుదేరిన విమానం విమానంలో పసిపిల్లలతో సహా మొత్తం 224 మంది భారతీయులు ప్రయాణిస్తున్నట్లు అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి మే 7 నుండి ప్రారంభమైన వందే భారత్ మిషన్ లో ఇది మూడవ దశ. ఇటీవలి జూన్ 11 న వందే భారత్ మిషన్ మూడవ దశ ప్రారంభమైంది. వందే భారత్ మిషన్ కింద దాదాపు 1,25,000 మంది భారతీయులు వివిధ దేశాల నుండి తిరిగి ఇండియాకి వచ్చారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం తెలిపారు.