వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా నామినేషన్ 

dokka manikya vara prasad

రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఎన్నికలో వైసిపి అభ్యర్ధిగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. వైసిపి ఎంపి నందిగం సురేష్‌, ఎమ్మెల్యే అంబలి రాంబాబు, శాసనమండలి పక్ష నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వెంటరాగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ శాసనమండలి కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. గతంలో టిడిపి తరపున ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. అప్పుడే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఇప్పుడు ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతుండగా వైసిపి తరపున ఆయన పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానానికి ఒక్క నామినేషన్ దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వైసిపి ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది.