కోవిడ్ నియంత్రణ, చికిత్సలో సిఎం జగన్ గారి ముందు చూపును ప్రతి రాష్ట్రం ప్రశంసిస్తోంది

vijayasai reddy

రాష్ట్రంలో కరోనాను నియంత్రించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ లో స్పందిస్తూ..... "కోవిడ్ నియంత్రణ, చికిత్సలో సిఎం జగన్ గారి కార్యదీక్ష, ముందు చూపును ప్రతి రాష్ట్రం ప్రశంసిస్తోంది. 7 లక్షల టెస్టులు పూర్తికాగా, ప్రతి కుటుంబానికి పరీక్షలు జరిపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 30 వేల బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే 2 నెలల్లో మరో 40 వేల పడకలు సిద్ధమవుతాయి." అని తెలిపారు.

అలాగే "ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ పదవిలో ఉన్నా జర్నలిస్టుగా 30 సంవత్సరాలు దేశమంతా పర్యటించిన వ్యక్తి. విద్యారంగ సంస్కరణలపై ఎంతో అవగాహన ఉంది. ఎల్లో మీడియాకు ఇదేమీ కనిపించడం లేదు." అని మండిపడ్డారు.