వరుణ్ మోటర్స్ అమ్మకాలపై రవాణా శాఖ కొరడా

Submitted by editor on Fri, 02/14/2020 - 04:34
Varun Motors

వరుణ్ మోటర్స్ అమ్మకాలపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు విజయవాడ, విశాఖల్లోని పలు షోరూముల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. మారుతీ కార్లు, బజాజ్ 2 వీలర్స్, ఆటోరిక్షాల దుకాణాల్లో తనిఖీలు చేసి, నిబంధనలు ఉల్లింఘించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వరుణ్ మోటార్స్ డీలర్ షిప్ లాగిన్‌ను అధికారులు నిలిపివేశారు. దర్యాప్తు కొనసాగించేందుకే లాగిన్లను నిలిపివేసినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక రానున్నట్లు తెలుస్తోంది.