‘‘ప్రేమికుల రోజును ఛీ కొట్టు...అమర జవాన్లకు జై కొట్టు’’

Submitted by editor on Fri, 02/14/2020 - 04:51
protest

విశాఖలో జనజాగరణ సమితి ఆధ్వర్యంలో ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో నిరసన  చేపట్టారు. దేశభక్తిని చాటుతున్న అమర జవాన్లను ప్రేమించాలని పాశ్చాత్య సంస్కృతిని విడనాడి... పుల్వామా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లను స్మరించుకోవాలని జనజాగరణ సమితి నేతలు విజ్ఞప్తి చేశారు. ‘‘ప్రేమికుల రోజును ఛీ కొట్టు...అమర జవాన్లకు జై కొట్టు’’ జనజాగరణ సమితి నేతలు నినాదాలు చేసారు.