సల్మాన్ ను కలిసేందుకు 600 కి.మీ. సైకిల్ ప్రయాణం

salman khan fan

స్టార్ హీరోల దృష్టిలో పడేందుకు అభిమానులు వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తుంటారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కలుసుకునేందుకు తన అభిమాని ఒకరు ఇలాంటి ప్రయత్నమే చేసాడు. తన అభిమాన హీరో ను కలవడానికి  సైకిల్ పై 600 కి.మీ.లు ప్రయాణించాడు ఓ వీరాభిమాని. అసోంలోని తీన్‌సుకియాకు చెందిన 52 ఏళ్ల భుపెన్ దాదాపు 600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి శుక్రవారంనాడు గువాహటి చేరుకున్నాడు. ఈనెల 15న ఫిల్మ్‌ఫేర్ వార్షిక అవార్డుల ప్రదానోత్సవం గువాహటిలో జరుగనుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో పాల్గొనేందుకు సల్మాన్ వస్తుండటంతో ఆయనను కలుసుకునేందుకు తాను ఇక్కడకు వచ్చినట్టు భుపెన్ తెలిపాడు. భూపెన్ ఇప్పటికే హ్యాండిల్స్‌ను తాకకుండా 60 నిమిషాల్లో 48 కిలోమీటర్లు సైక్లింగ్ చేసినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు.