పుల్వామా ఎటాక్ కు ఏడాది

pulwama attack

జమ్మూ-శ్రీనగర్​ హైవేపై పుల్వామా జిల్లా అవంతిపురా దగ్గర 2019 ఫిబ్రవరి 14న సీఆర్​పీఎఫ్ కాన్వాయ్​టార్గెట్​గా టెర్రరిస్టులు ఎటాక్​ జరిగిన విషయం తెలిసిందే. పాకిస్తానీ టెర్రరిస్టు గ్రూపు జైషే మహమూద్​కు చెందిన సూసైడ్​ బాంబర్​ కారులో ఐఈడీతో దూసుకువచ్చి సీఆర్పీఎఫ్ జవాన్లు వెళుతున్న బస్సును ఢీకొట్టాడు. ఈ ఘటనలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు అమరులయ్యారు. ఈ దాడి జరిగి నేటికి ఏడాది. ప్రేమికుల దినోత్సవం నాడు చోటుచేసుకున్న ఈ ఘటన జాతి మొత్తాన్ని ఒక్కసారిగా భావోద్వేగానికి గురిచేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చిన్నచిన్న గ్రామాల్లో ప్రజలు సైతం రోడ్లపైకి వచ్చారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని జనం తపన పడ్డారు. 
పుల్వామా ఎటాక్​లో అమరులైన సీఆర్​పీఎఫ్ జవాన్లకు గౌరవ సూచకంగా పుల్వామా జిల్లా లితోపొరా క్యాంప్​లో అమరవీరుల స్థూపం నిర్మించారు. దీని కోసం మరణించిన జవాన్ల ఇండ్ల నుంచి మట్టిని తీసుకొచ్చారు. 40 మంది జవాన్ల పేర్లు, ఫొటోలతో దీనిని నిర్మించారు.